ZEE 5 లో అదరగొడుతోన్న ‘రెక్కీ’ వెబ్‌సిరీస్

ABN , First Publish Date - 2022-06-20T15:55:43+05:30 IST

కరోనా లాక్‌డౌన్ పుణ్యామా అని ప్రపంచంలోని వివిధ దేశాల ఓటీటీ కంటెంట్ ప్రేక్షకులకు అతి పెద్ద కాలక్షేపంగా మారింది. ఇంతవరకు ఆ వెబ్ సిరీస్ ను ఆస్వాదిస్తూ వచ్చిన వారిని ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోని వెబ్ సిరీస్ కూడా ఎంటర్ టైన్ చేశాయి. అదే కోవలో తెలుగులో కూడా కొన్ని వెబ్ సిరీస్ వచ్చాయి.

ZEE 5 లో అదరగొడుతోన్న ‘రెక్కీ’ వెబ్‌సిరీస్

కరోనా లాక్‌డౌన్ పుణ్యామా అని ప్రపంచంలోని  వివిధ దేశాల ఓటీటీ కంటెంట్ ప్రేక్షకులకు అతి పెద్ద కాలక్షేపంగా మారింది. ఇంతవరకు ఆ వెబ్ సిరీస్ ను ఆస్వాదిస్తూ వచ్చిన వారిని ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోని వెబ్ సిరీస్ కూడా ఎంటర్ టైన్ చేశాయి. అదే కోవలో తెలుగులో కూడా కొన్ని వెబ్ సిరీస్ వచ్చాయి. అయితే అవి అంతగా జనాన్ని ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈ మధ్య వస్తున్న మన ఒరిజినల్స్ లోనూ క్వాలిటీ  బాగా పెరిగింది. దాంతో పాటు ఆకట్టుకొనే కథాంశాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ZEE 5 లో రీసెంట్ గా స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు వెబ్ సిరీస్ ‘రెక్కీ’ (Reccee). మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో కొత్త దర్శకుడు పోలూరు కృష్ణ (Poluri Krishna) మలిచిన ఈ వెబ్ సిరీస్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. 


మొత్తం 6 ఎపిసోడ్స్‌గా విడుదలైన ఈ సిరీస్ లో ‘రోజాపూలు’ (Rojapoolu) ఫేమ్  శ్రీరామ్ (Sriram) ప్రధాన పాత్ర పోషించగా.. ఆడుకళాం నరేన్, శివబాలాజీ, రాజశ్రీనాయర్, ఎస్తేర్, సూర్యతేజ, శరణ్యా ప్రదీప్, జీవా, కోటేశ్వరరావు, ధన్య బాలకృష్ణన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం పరదేశీ అనే పాత్ర పోషించిన సమ్మెటగాంధి (Sammeta Gandhi) దే. పక్కాగా రెక్కీ చేసి.. పెర్ఫెక్ట్ గా స్కెచ్ వేసి మర్డర్ చేసే మాస్టర్ బ్రైన్ పరదేశీది. అతడు స్కెచ్ వేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హత్య జరిగి తీరాల్సిందే. అతడ్ని ఉపయోగించుకోవాలే కానీ.. తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని ఆ పాత్రతో తెలియచెప్పాడు సమ్మెట గాంధి. ఒక విధంగా రెక్కీ సిరీస్ మొదటి సీజన్‌కు హీరో అతడేనని చెప్పాలి. 6వ ఎపిసోడ్ ఎండింగ్ లో దీనికి రెండో సీజన్ ఉంటుందనే హింటిచ్చాడు దర్శకుడు. 



రాయలసీమలోని తాడిపత్రి గ్రామం నేపథ్యంలో నడిచే కథాంశమిది. అక్కడ మున్సిపల్ చైర్మన్ ను, అతడి కొడుకును కొందరు మర్డర్ చేస్తారు. ఈ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఓ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు. కొద్దిరోజుల ఇన్వెస్టిగేషన్ లో ఈ మర్డర్స్ కు సూత్రధారి ఎవరో తెలుస్తుంది. అయితే దర్యాప్తులో అతడికి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఇంతకీ ఆ మర్డర్స్ ను ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అనేవి చాలా ఆసక్తికరంగా మారతాయి. మరి చివరికి అసలు హంతకులు దొరికారా లేదా అన్నదే మిగతా కథాంశం. గ్రామీణ నేపథ్యంలోని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కావడం ఈ సీరీస్ ప్రత్యేకత. మొత్తం 6 ఎపిసోడ్స్ లోనూ అడుగడుగునా ఉత్కంఠత కలిగించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. 

Updated Date - 2022-06-20T15:55:43+05:30 IST