Love Story in Pakistan: అతను సల్మాన్ ఖాన్.. ఆమె కత్రినా కైఫ్.. పాకిస్తాన్‌లో బాలీవుడ్ లవ్‌స్టోరీ..

Twitter IconWatsapp IconFacebook Icon
Love Story in Pakistan: అతను సల్మాన్ ఖాన్.. ఆమె కత్రినా కైఫ్.. పాకిస్తాన్‌లో బాలీవుడ్ లవ్‌స్టోరీ..

ఆమె పేరు నాజియా (Naziya). ఆ నగరంలోనే పెద్ద ధనవంతురాలు. అతని పేరు సుఫియాన్ (Sufian). ఆర్థికంగా అంతగా లేనివాడు. అతనికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. కానీ అతన్ని, నజియానే ప్రేమించింది. ఆమె మొదట ప్రపోజ్ చేసి మరి అతన్ని పెళ్లాడింది. 40 ఏళ్లకు పైగా వయస్సున వీరి లవ్‌స్టోరీ (Love Story) అక్కడ చాలా పాపులర్. సామాజిక, వయో అడ్డంకులను పట్టించుకోకుండా ఒకరినొకరు ప్రేమించుకున్న నాజియా, సుఫియాన్ కథ ఇది.


నాజియా, సుఫియాన్‌ ఇద్దరూ కూడా పాకిస్థాన్‌ (Pakistan)లోని ఇస్లామాబాద్‌కు చెందినవారు. నాజియా చాలా కాలంగా ఒంటరిగా ఉంటున్న గృహిణి. ఆమెకు ఇంటి పనులకు సహాయంగా ఒకరు కావాలి. ఒక స్నేహితుడి సిఫార్సు మేరకు సుఫియాన్‌‌ను పనిలో పెట్టుకుంది. దీని గురించి ఓ యూట్యూబ్ ఛానల్‌తో నాజియా మాట్లాడుతూ.. ‘నేను ఇంటి సహాయంగా నెలకు రూ.18వేల జీతానికి సుఫియాన్‌ని రిక్రూట్ చేసుకున్నాను. రోజులు గడిచేకొద్దీ సుఫియాన్ అలవాట్లు, ఆలోచనలు, ప్రపంచం గురించి అతనికి ఉన్న అభిప్రాయాల పట్ల ఆకర్షితురాలినయ్యాను. అతను ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదు. అలాగే చాలా మంచివాడు. దాంతో అతనిపై ఇష్టం కలిగింది. అందుకే డబ్బు, అందం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు’ అని చెప్పుకొచ్చింది.


ప్రపోజ్ చేయడం మగవాడి పని అనే మరో అపోహను బద్దలు కొట్టినట్టు నాజియా తెలిపింది. ‘నేనే మొదట అతనికి ప్రపోజ్ చేశాను. అది విన్న వెంటనే సుఫియాన్‌ మూర్ఛపోయాడు. అనంతరం అతను కూడా నా ప్రేమని ఒప్పుకొన్నాడు. తనకి నేనంటే ఇష్టమేనని చెప్పాడు’ అని నజియా చెప్పింది.


అనంతరం పెళ్లి చేసుకున్న ఈ లవ్ బర్డ్స్ 14 సంవత్సరాలుగా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే.. పెళ్లి తర్వాత సుఫియాన్ ప్రవర్తన గురించి నాజియా మాట్లాడుతూ.. ‘సుఫియాన్ నాకు అన్ని రకాలుగా సహాయపడతాడు. జ్వరం వచ్చినప్పుడు మందు తెచ్చి నా బాగోగులు చూసుకుంటాడు. అతనే స్వయంగా భోజనం వండుతాడు’ అని చెప్పుకొచ్చింది.


అయితే, ఈ ప్రేమకథను చాలామంది విమర్శలు చేశారు. చాలామంది దెప్పిపొడుపులను భరించాల్సి వచ్చింది. కానీ.. అవేమీ పట్టించుకోకుండా ఈ జంట చాలా సంతోషంగా కాలం గడుపుతోంది. అంతేకాకుండా.. ఎవరికైనా తమ ప్రేమకథని చెప్పేటప్పుడు నాజియా తన భర్తను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ (Salman Khan)తో పోల్చగా.. సుఫియాన్ తన భార్యను ఆమెను హీరోయిన్ కత్రినా కైఫ్‌(Katrina Kaif)తో పోల్చడం విశేషం. అందుకే వీరి ప్రేమకథ పాకిస్తాన్‌‌లో బాలీవుడ్ లవ్‌స్టోరీగా ప్రసిద్ధి చెందింది.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.