# Rc15: డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది వారేనా..?

ABN , First Publish Date - 2022-01-23T15:00:33+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆర్సీ 15' సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ జీ స్టూడియోస్ వారు దక్కించుకున్నట్లు తాజా సమాచారం.

# Rc15: డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది వారేనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆర్సీ 15' సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ జీ స్టూడియోస్ వారు దక్కించుకున్నట్లు తాజా సమాచారం. దిగ్గజ ఓటీటీ సంస్థలతో పోటీపడి మరీ ఫ్యాన్సీ రేటుకు ఈ రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ - శంకర్‌ల సినిమా 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాత దిల్ రాజు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో 'ఆర్సీ 15' నాన్-థియేట్రికల్ రైట్స్ అన్నిటిని జీ స్టూడియోస్ వారికిఇచ్చేసి.. అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ మాత్రం ఆయన దగ్గరే పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ త్వరలో ఇవ్వనున్నారట. కియారా ఈ మూవీలో చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.   

Updated Date - 2022-01-23T15:00:33+05:30 IST