# RC 15: రిలీజ్ ఎప్పుడో రివీల్ చేసిన దిల్ రాజు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ చిత్రం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి అంటే.. 2023, జనవరి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు కన్‌ఫర్మ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆయన సంస్థలో 50వ చిత్రంగా నిర్మితమవుతోంది. అందుకే ఏమాత్రం బడ్జెట్‌కు వెనకాడకుండా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.