# RC 15: చెన్నై చేరుకున్న చరణ్..?

ABN , First Publish Date - 2022-01-08T18:14:04+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం చరణ్ చెన్నైలో ల్యాండ్ అయినట్టు తజా సమాచారం.

# RC 15: చెన్నై చేరుకున్న చరణ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం చరణ్ చెన్నైలో ల్యాండ్ అయినట్టు తజా సమాచారం. ఇప్పటికే షూటింగ్ మొదలై పూణే, హైదరాబాద్‌లలో కొతభాగం చిత్రీకరణ పూర్తైంది. ఈ షూటింగ్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్, సాంగ్‌ను పూర్తి చేశారట. అయితే, రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, చరణ్ హీరోలుగా రూపొందిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ కోసం # RC 15కి బ్రేక్ ఇచ్చారు. కానీ, కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చరణ్ ..శంకర్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవ్వాలని డిసైడయ్యాడట. అందుకే చెన్నైలో దిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాగా నిర్మిస్తున్నారు.

Updated Date - 2022-01-08T18:14:04+05:30 IST