పుట్టిన రోజునాడు ఆకట్టుకున్న ‘రామారావు’

ABN , First Publish Date - 2022-01-26T17:09:49+05:30 IST

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం‘రామారావు ఆన్ డ్యూటీ’. యస్సెల్వీ సినిమాస్, యల్.యల్.పీ బ్యానర్స్ పై చెరుకూరి సుధాకర్ నిర్మాణంలో.. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ సిన్సియర్ యం.ఆర్వోగా నటిస్తున్నారు. దివ్యాంష్ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో తొట్టెంపూడి వేణు కీలక పాత్ర పోషిస్తున్నారు. యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.

పుట్టిన రోజునాడు ఆకట్టుకున్న ‘రామారావు’

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం‘రామారావు ఆన్ డ్యూటీ’. యస్సెల్వీ సినిమాస్, యల్.యల్.పీ బ్యానర్స్ పై చెరుకూరి సుధాకర్ నిర్మాణంలో..  కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ సిన్సియర్ యం.ఆర్వోగా నటిస్తున్నారు. దివ్యాంష్ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తుండగా.. తొట్టెంపూడి వేణు కీలక పాత్ర పోషిస్తున్నారు. యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలో ఈ మూవీ సాంగ్స్ ను విదేశాల్లో చిత్రీకరించబోతున్నారు. నేడు (బుధవారం) రవితేజ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్.. ఈ సినిమా ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.


రవితేజ అగ్రెసివ్ లుక్ నేపథ్యంలో ఓ ట్రైన్ ఎపిసోడ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే.. మరికొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలకు సంబంధించిన స్టిల్స్ కూడా రివీల్ అయ్యాయి. ఈ సినిమాకి ఇవే హైలైట్స్ అని తెలుస్తోంది. ట్రైన్ ఎపిసోడ్స్ లో రవితేజ చెలరేగుతాడని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇంతకు ‘వెంకీ’ మూవీలోని ట్రైన్ ఎపిసోడ్ ఏ స్థాయిలో పేలిందో తెలిసిందే. మరి రామారావు గా రవితేజ ఏ స్థాయి విజయం అందుకుంటాడో చూడాలి. 



Updated Date - 2022-01-26T17:09:49+05:30 IST