తమిళ బ్లాక్‌బస్టర్ రీమేక్ లో మాస్ మహారాజా?

ABN , First Publish Date - 2022-01-13T16:41:36+05:30 IST

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు ప్లానింగ్‌లో ఉన్నాయి. తాజాగా రవితేజ మరో ఇంట్రెస్టింగ్ మూవీలో నటిస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. అది కూడా ఓ తమిళ బ్లాక్ బస్టర్ రీమేక్. సినిమా పేరు ‘మానాడు’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన ఈ సినిమా మొన్నీ మధ్యే థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైంది.

తమిళ బ్లాక్‌బస్టర్ రీమేక్ లో మాస్ మహారాజా?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు ప్లానింగ్‌లో ఉన్నాయి. తాజాగా రవితేజ మరో ఇంట్రెస్టింగ్ మూవీలో నటిస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. అది కూడా ఓ తమిళ బ్లాక్ బస్టర్ రీమేక్. సినిమా పేరు ‘మానాడు’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన ఈ సినిమా మొన్నీ మధ్యే థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయి.. అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. టైమ్ లూప్ కథాంశంతో ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ థ్రిల్లర్ మూవీ డబ్బింగ్ అండ్ రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.


నిజానికి ‘మానాడు’ చిత్రం హాట్ స్టార్ లోకి వచ్చినప్పుడు అందులో తెలుగు వెర్షన్ ను ‘రివైండ్’ పేరుతో అందుబాటులో ఉంచారు. అంతకు ముందే ఈ సినిమాను ‘దిలూప్’ పేరుతో డబ్బింగ్ వెర్షన్ ను థియేటర్స్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ సినిమానే ఇప్పుడు సురేశ్ ప్రొడక్షన్స్ వారు తెలుగులో రీమేక్ చేయనుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బేసిక్ లైన్ ను రవితేజ తో డిస్కస్ చేశారట సురేశ్ బాబు. కథాంశం బాగా నచ్చి రవితేజ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే తెలుగు వెర్షన్ కు వెంకట్ ప్రభునే దర్శకత్వం వహిస్తారా లేక వేరే దర్శకుడి చేతిలో పెడతారా అనే విషయంలో క్లారిటీ లేదు. మరి నిజంగానే ‘మానాడు’ చిత్రం రవితేజ హీరోగా తెరకెక్కుతుందో లేదో తెలియాలంటే.. కొద్దిరోజులు వెయిట్ చేయాల్సి ఉంది.  

Updated Date - 2022-01-13T16:41:36+05:30 IST