రవితేజ ‘ఖిలాడి’: ఫుల్‌ కిక్‌ వచ్చేసింది!

ABN , First Publish Date - 2022-01-27T00:09:02+05:30 IST

మాస్‌ మహారాజా రవితేజ, రమేశ్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘ఖిలాడి’ చిత్రంలోని నాలుగో పాటని బుధవారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫుల్‌ కిక్‌’ అంటూ సాగే మాస్‌ పాటను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను సాగర్‌, మమతా శర్మ ఆలపించారు.

రవితేజ ‘ఖిలాడి’: ఫుల్‌ కిక్‌ వచ్చేసింది!

మాస్‌ మహారాజా రవితేజ, రమేశ్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘ఖిలాడి’ చిత్రంలోని నాలుగో పాటని  బుధవారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫుల్‌ కిక్‌’ అంటూ సాగే  మాస్‌ పాటను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను సాగర్‌, మమతా శర్మ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. శేఖర్‌ మాస్టర్‌ రవితేజ, డింపుల్‌ హయాతీతో అదిరేటి స్టెప్పులు వేయించారు. బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ పెన్‌ స్టూడియోస్‌, ఏ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలు పోషిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతీ నాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 11న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.




Updated Date - 2022-01-27T00:09:02+05:30 IST