Raviteja : ద్విపాత్రలతో అదిరిపోయే ట్రీట్ ?

ABN , First Publish Date - 2022-05-15T16:56:52+05:30 IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా, నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. పేరుకు తగ్గట్టుగానే ఇందులో రవితేజ అభిమానులకు డబుల్ ఇంపాక్ట్‌తో మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు టాక్. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయంతో అలరించబోతున్నట్టు ఇదివరకే వార్తలు వినిపించాయి.

Raviteja : ద్విపాత్రలతో అదిరిపోయే ట్రీట్ ?

మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా,  నక్కిన త్రినాథరావు (Nakkina trinatharao) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ (Dhamaka). పేరుకు తగ్గట్టుగానే ఇందులో రవితేజ అభిమానులకు డబుల్ ఇంపాక్ట్‌తో మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు టాక్. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయంతో అలరించబోతున్నట్టు ఇదివరకే వార్తలు వినిపించాయి. అయితే ఈ సారి గత చిత్రాల్ని తలదన్నే రీతిలో రవితేజ డ్యూయల్ రోల్స్ (Duel Roles) ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయని నిర్మాతలు చెబుతున్నారు. రవితేజ రెండు పాత్రల స్వభావం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని టాక్.


ప్రధమార్ధంలో కనిపించే రవితేజ (Raviteja) పాత్ర కూల్ గా రెగ్యులర్ గా కనిపించినా.. ఇంట్రవెల్‌లో రెండో పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఓ రేంజ్‌లో ఉంటుందని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇది పూర్తిగా నెగెటివ్ షెడ్స్‌లో ఉంటుందని సమాచారం. దర్శకుడు త్రినాథరావు ఇప్పటివరకూ స్టార్ హీరోలతో చేయలేదు. ‘ధమాకా’తో దర్శకుడిగా నెక్స్ట్ లెవెల్‌కు చేరతాడని చెబుతున్నారు. రవితేజ గతంలో ‘ఓ పనైపోతుంది బాబు, విక్రమార్కుడు, కిక్ 2, దరువు’ లాంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశాడు. వాటిలో ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) చిత్రం ఒకటే ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.


ఇప్పుడు ‘ధమాకా’ (Dhamaka) చిత్రంతో మరోసారి డ్యూయల్ రోల్స్ లో తనదైన శైలిలో ఎంటర్‌టైన్ చేయబోతున్నాడు. పూర్తి ఎనర్జిటిక్‌గా రవితేజ (Raviteja) రెండు పాత్రల్లోనూ చెలరేగబోతున్నాడని తెలుస్తోంది. ఇదివరకు ‘సముద్రం’ చిత్రంలో రవితేజ విలన్ పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఇప్పుడు మరోసారి ‘ధమాకా’ లో రవితేజ విలనిజం మెప్పిస్తుందని అంటున్నారు. ఈ పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని సమాచారం. మరి ‘ధమాకా’ చిత్రం రవితేజకు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2022-05-15T16:56:52+05:30 IST