సెట్స్‌పైకి రవితేజ ‘రావణాసుర’

ABN , First Publish Date - 2022-01-18T22:13:56+05:30 IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రావణాసుర’ చిత్రం.. సంక్రాంతి పండుగరోజున మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను

సెట్స్‌పైకి రవితేజ ‘రావణాసుర’

మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రావణాసుర’ చిత్రం.. సంక్రాంతి పండుగరోజున మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను తాజాగా ప్రారంభించినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేసింది. ఈ షూట్‌లో చిత్ర ప్రధాన తారాగ‌ణంపై నైట్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్లుగా కూడా మేకర్స్ ప్రకటించారు.


రవితేజ న్యాయవాదిగా నటించబోతోన్న ఈ చిత్రంలో రామ్ పాత్రలో సుశాంత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. రవితేజ సరసన మొత్తం ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో నటిస్తున్నారు. రచయితగా ఎంతో బిజీగా ఉన్న శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథను అందించగా.. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సంగీత బాధ్యతలు నిర్వహించనున్నారు.

Updated Date - 2022-01-18T22:13:56+05:30 IST