హాలీవుడ్ సినిమాలో హాట్ ఆపర్... Raveena Tandon ఎందుకు రిజెక్ట్ చేసిందంటే...

ABN , First Publish Date - 2021-12-04T22:25:55+05:30 IST

మన బాలీవుడ్ తారలు ఇంగ్లీష్ సినిమాల్లో నటించటం కొత్తేం కాదు. హాలీవుడ్ క్రేజీ సినిమాల్లో మన వాళ్లు ఛాన్స్‌లు కొట్టేశారు. ఐశ్వర్య మొదలు దీపికా పదుకొణేదాకా ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. అయితే, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయి దాకా వచ్చినా వద్దని తిరస్కరించిన వారు కూడా లేకపోలేదు. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ అదే పని చేసిందట...

హాలీవుడ్ సినిమాలో హాట్ ఆపర్...  Raveena Tandon ఎందుకు రిజెక్ట్ చేసిందంటే...

మన బాలీవుడ్ తారలు ఇంగ్లీష్ సినిమాల్లో నటించటం కొత్తేం కాదు. హాలీవుడ్ క్రేజీ సినిమాల్లో మన వాళ్లు ఛాన్స్‌లు కొట్టేశారు. ఐశ్వర్య మొదలు దీపికా పదుకొణేదాకా ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. అయితే, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయి దాకా వచ్చినా వద్దని తిరస్కరించిన వారు కూడా లేకపోలేదు. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ అదే పని చేసిందట... 


అమెరికన్ డైరెక్టర్ ఒలివర్ స్టోన్ రూపొందించిన హిస్టారికల్ మూవీ ‘అలెగ్జాండర్’. బాక్సాఫీస్ వద్ద అప్పట్లో పెద్ద చర్చకు కారణమైంది. దేశదేశాల్లో వివాదాలు చెలరేగాయి. కలెక్షన్ల పరంగా ‘అలెగ్జాండర్’ ఫలితం ఎలా ఉన్నా... అందులో ఓ పాత్రకి అప్పట్లో రవీనాని అడిగారట! ఈ విషయం స్వయంగా ఆమే చెప్పింది. దర్శకుడు ఒలివర్ స్టోన్ తనకు ఆఫర్ చేసిన రోల్ నచ్చకే అరుదైన అవకాశాన్ని తిరస్కరించిందట. హిందీ తెరపై తాను చేయని ‘సీన్స్’, ‘ఇతర పనులు’ హాలీవుడ్‌లో ఎందుకు చేయాలని ఆమె ప్రశ్నించింది. తనకు సౌకర్యవంతంగా లేని పాత్ర కాబట్టే ‘అలెగ్జాండర్’ లాంటి సినిమాను రవీనా రిజెక్ట్ చేశానని వివరించింది. డస్కీ బ్యూటీ రవీనా తరువాత కూడా ఎప్పుడూ హాలీవుడ్ బాట పట్టలేదు. హిందీతోనే సరిపెట్టింది...    


1990లలో రవీనా జోరు బాలీవుడ్‌లో అధికంగా ఉండేది. గ్లామర్ పాత్రలకి, బోల్డ్ సాంగ్స్‌కి ఆమె ఫేమస్. తెలుగులోనూ బాలయ్య లాంటి స్టార్ హీరోల సరసన రవీనా నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘కేజీఎప్ 2’లో ఓ కీలక పాత్ర చేసింది. యశ్ స్టారర్ ప్యాన్ ఇండియా మూవీ నెక్ట్స్ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది... 

Updated Date - 2021-12-04T22:25:55+05:30 IST