‘రావణాసుర‘: ఆకట్టుకుంటున్న సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్
ABN , First Publish Date - 2022-01-12T14:35:57+05:30 IST
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర‘. ఇందులో అక్కినేని యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించబోతుండగా, చిత్రబృందం తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలింది.

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర‘. ఇందులో అక్కినేని యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించబోతుండగా, చిత్రబృందం తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం జనవరి 14న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రవితేజ ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లకు విశేష సంప్దన లభించింది. కాగా, యంగ్ హీరో సుశాంత్ ‘రావణాసుర‘ చిత్రంలో రామ్ పాత్రలో నటించబోతున్నట్టు మేకర్స్ తాజాగా కన్‌ఫర్మ్ చేశారు. ఈ మేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది.