తన ఫేవరెట్ సింగర్‌తో Ratan Tata... Ranveer Singh ఏమన్నాడంటే...
ABN , First Publish Date - 2022-01-15T00:03:53+05:30 IST
రతన్ టాటాతో ఫోటో దిగాలని చాలా మంది కోరుకుంటారు. మామూలు వాళ్లే కాదు సెలబ్రిటీలు కూడా ఆయనతో ఒకే ఫ్రేమ్‌లో కనిపించేందుకు ఉత్సాహం చూపిస్తారు. కానీ, ఓసారి రతన్ టాటా స్వయంగా మరో సెలబ్రిటీతో కలసి కెమెరాకు ఫోజిచ్చాడు!
రతన్ టాటాతో ఫోటో దిగాలని చాలా మంది కోరుకుంటారు. మామూలు వాళ్లే కాదు సెలబ్రిటీలు కూడా ఆయనతో ఒకే ఫ్రేమ్‌లో కనిపించేందుకు ఉత్సాహం చూపిస్తారు. కానీ, ఓసారి రతన్ టాటా స్వయంగా మరో సెలబ్రిటీతో కలసి కెమెరాకు ఫోజిచ్చాడు! అతనే అమెరికన్ గాయకుడు ‘స్లాష్’...
‘గన్స్ అండ్ రోజెస్’... వెస్ట్రన్ మ్యూజిక్ గురించి తెలిసిన ఎవరికైనా తెలిసే పేరు. అమెరికాలో ఎంతో ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ బ్యాండ్. అలాగే, ‘గన్స్ అండ్ రోజెస్’ అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చే రాక్‌స్టార్... ‘స్లాష్’. అతడితోనే రతన్ టాటా అప్పట్లో ఓ ఫోటో తీయించుకున్నాడట. ఆ విషయం ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. స్లాష్‌తో తన త్రోబ్యాక్ పిక్‌ని కూడా షేర్ చేశాడు.
రతన్ టాటా ఓ సారి అమెరికాలోని తమ జాగ్వార్ రిటైల్ ఔట్‌లెట్‌కి వెళ్లాడు. అప్పుడే అక్కడికి తన కొత్త జాగ్వార్ కార్ డెలివరీ తీసుకునేందుకు స్లాష్ కూడా వచ్చాడు. అదుగో అప్పుడే ఈ లెజెండ్స్ ఇద్దరి కలయిక కెమెరాకు చిక్కింది. ‘‘ఎ వెరీ పొలైట్ రాక్‌స్టార్, స్లాష్’’ అంటూ టాటా ఇన్‌స్టాలో కితాబునిచ్చారు. కాగా ‘‘వావ్!! దిసీజ్ టూ కూల్!’’ అంటూ రణవీర్ కామెంట్స్ సెక్షన్‌లో స్పందించాడు!