Rashmi-Rocket: ట్రైలర్ విడుదల..

ABN , First Publish Date - 2021-09-24T15:18:33+05:30 IST

తాప్సీ నటించిన లేటెస్ట్ మూవీ 'రష్మీ రాకెట్'. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. 'ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇక్కడ కొంతకాలం సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న తాప్సీ

Rashmi-Rocket: ట్రైలర్ విడుదల..

తాప్సీ నటించిన లేటెస్ట్ మూవీ 'రష్మీ రాకెట్'. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. 'ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇక్కడ కొంతకాలం సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆమె ఎంచుకుంటున్న కథలు.. వాటిలోని పాత్రలు అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాప్సీ 'రష్మీ రాకెట్' మూవీతో వచ్చేందుకు సిద్దమవుతోంది. ఆకర్ష్ ఖురానా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. దీన్ని చూస్తే ఓ లేడీ అథ్లెట్ తన లక్ష్యం చేరడం కోసం ఎలాంటి అవాంతరాల్ని ఎదుర్కొంది?... ఎలాంటి వివక్షకు గురైంది? తన ద్వారా మహిళ లింగ వివక్ష టెస్టింగ్.. స్త్రీత్వంపై 'రష్మీ రాకెట్' తన గెలుపు ద్వారా ఈ ప్రపంచానికి ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంది? అనే అద్భుతమైన నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది. 


ఈ ట్రైలర్‌లో ప్రతీ సన్నివేశాన్ని ఎంతో పక్కాగా తెరకెక్కించారని తెలుస్తోంది. ఓ అథ్లెట్ ఎదుర్కొన్న అవమానాలు, జెండర్ వివక్షని హృదయాలను హత్తుకునేలా చూపించే ప్రయత్నం చేశారని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. 'పింక్', 'బద్లా', 'నామ్ షభానా' లాంటి డిఫరెంట్ మూవీస్‌లాగానే 'రష్మీ రాకెట్' కూడా మంచి ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కింది. చూడాలి మరి ఈ మూవి తాప్సీకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో. స్టోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ అక్టోబర్ 15న జీ5 ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. 



Updated Date - 2021-09-24T15:18:33+05:30 IST