ఒక్క హిట్ దక్కాలే కానీ.. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి హీరోయిన్స్ ఏ మాత్రం వెనుకాడరు. ముఖ్యంగా సౌత్ హీరోయిన్స్ ఆడింది ఆట.. పాడింది పాటగా ఉంది. స్టార్ హీరోయిన్లు ఒకో సినిమాకి రెండు నుంచి మూడు కోట్లు వరకూ అందుకుంటున్నారు. ఐటెమ్ సాంగ్స్ కైతే ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇటీవల సమంత ‘పుష్ప’ సినిమాలోని ఐటెమ్ సాంగ్ కోసం కోటిన్నర పారితోషికం అందుకుంది. ‘గని’ చిత్రం కోసం తమన్నా కోటి వరకూ వసూలు చేసింది. ఇప్పుడు రష్మికాకు అలాంటి అవకాశమే వచ్చినట్టు టాక్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో ‘యానిమల్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ పాటను ఓ క్రేజీ సౌత్ హీరోయిన్ తో చేయించాలన్నది అతడి ఆలోచన. అందుకే రష్మికా మందణ్ణను సంప్రదించాడట. దానికి రష్మికా ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసిందని టాక్.
రష్మికా ఓ పూర్తి స్థాయి సినిమాకి రూ. 2కోట్లు పారితోషికం తీసుకుంటోంది. పైగా దానికి 30రోజులు కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఐటెమ్ సాంగ్ అయితే మ్యాగ్జిమమ్ 5 రోజులు, మినిమమ్ మూడురోజులు చాలు. ఆ మాత్రం దానికి రష్మికా రెండు కోట్లు డిమాండ్ చేయడంతో బాలీవుడ్ నిర్మాతలు షాకయ్యారు. దాంతో రష్మికాతో నిర్మాతలు బేరసారాలు సాగించి.. మొత్తానికి కోటిన్నర ఇవ్వడానికి సిద్ధమయ్యారట. కోటిన్నర ఇచ్చినా రష్మికాకు బాగానే గిట్టుబాటైనట్టు. మరి కోటిన్నరకి శ్రీవల్లి ఒప్పుకుంటుందా? లేక రెండు కోట్లు ఇచ్చితీరాలని మంకుపట్టు పడుతుందా? అన్నది చూడాలి.