రాజ్ తరుణ్‌కి రష్మిక మందన్న సపోర్ట్

ABN , First Publish Date - 2022-01-19T01:28:13+05:30 IST

యంగ్ హీరో రాజ్ తరుణ్‌, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ఈ సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న

రాజ్ తరుణ్‌కి రష్మిక మందన్న సపోర్ట్

యంగ్ హీరో రాజ్ తరుణ్‌, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ఈ సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రంలోని ‘పదా’ అనే లిరికల్ సాంగ్‌ని.. హీరోయిన్ రష్మిక మందన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ పాట విషయానికి వస్తే.. నలుగురు స్నేహితులు రోడ్ జర్నీ నేపథ్యంలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే విజువల్స్‌లో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మల మధ్య స్నేహానికి మించిన బంధమేదో ఉన్నట్టు కనిపిస్తోంది. మంచి మంచి లొకేషన్స్‌లో ఈ పాటని చిత్రీకరణ జరిగినట్లుగా విజువల్స్ చెబుతున్నాయి. కాగా, ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా.. స్వీకర్ అగస్తి మంచి మెలోడీ ట్యూన్‌ను అందించారు. యాజిన్ నాజర్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Updated Date - 2022-01-19T01:28:13+05:30 IST