రష్మికా లేడీ ఓరియెంటెడ్ మూవీ స్టోరీ ఇదేనా?

ABN , First Publish Date - 2022-01-10T18:26:15+05:30 IST

కన్నడ బ్యూటీ రష్మికా మందణ్ణ ఇటీవల ‘పుష్ప’ సినిమాతో బ్లా్క్ బస్టర్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీలో నటిస్తోంది. అలాగే.. ‘మిషన్ మజ్ను, గుడ్ బై’ బాలీవుడ్ చిత్రాల్లోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. రష్మికా ఈ ఏడాది మరో ఇంట్రెస్టింగ్ సినిమాకి కమిట్ అవుతోంది. ఆమెకిది మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ మూవీ . దీనికి రాహుల్ రవీంద్ర దర్శకుడు. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’లో నానీ అన్నగా కీలకపాత్ర పోషించిన రాహుల్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే ఉత్సాహంతో ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.

రష్మికా లేడీ ఓరియెంటెడ్ మూవీ స్టోరీ ఇదేనా?

కన్నడ బ్యూటీ రష్మికా మందణ్ణ ఇటీవల ‘పుష్ప’ సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీలో నటిస్తోంది. అలాగే.. ‘మిషన్ మజ్ను, గుడ్ బై’ బాలీవుడ్ చిత్రాల్లోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇవి కాకుండా ఈ ఏడాది మరో ఇంట్రెస్టింగ్ సినిమాకి కమిట్ అవుతోంది.  ఆమెకిది మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ మూవీ. దీనికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’లో నానీ అన్నగా కీలకపాత్ర పోషించిన రాహుల్ మంచి పేరు తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ మలయాళ మూవీ రీమేక్ వెర్షన్‌లో హీరోగా నటిస్తున్నాడు. దాంతో పాటు  ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.


సినిమా కథ మొత్తం రష్మికా చుట్టునే తిరుగుతుందట. 1995లో ప్రధాని గా ఉన్న  పీవీ నరసింహారావు  భారతదేశంలో ఎన్నో ఆర్ధిక సంస్కరణలు చేపట్టి.. ఆస్తవ్యస్తంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టారు. ఈ నేపథ్యాన్ని దర్శకుడు రాహుల్ ఈ  కథకు జోడిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక కిరాణా కొట్టు వాడి కూతురు పెద్ద బిజినెస్ విమన్ గా ఎలా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇందులోని రష్మికా పాత్ర చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలుస్తోంది. నాగార్జునతో ‘మన్మథుడు 2’ తీసి పరాజయం ఎదుర్కొన్న రాహుల్.. ఈ సినిమాతో దర్శకుడిగా తిరిగి ఫామ్ లోకి రావాలనుకుంటున్నాడు. మరి ఈ సినిమా రష్మికాకు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2022-01-10T18:26:15+05:30 IST