'తలపతి విజయ్'తో..హింట్ ఇచ్చిన రష్మిక

'తలపతి' విజయ్‌తో నటించబోతున్నట్టు హింట్ ఇచ్చింది క్రేజీ హీరోయిన్ రష్మిక అందన్న. ఈమె ప్రస్తుతం తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సరసన పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్‌లో సిధార్థ్ మల్హోత్రాకి జంటగా 'మిషన్ మజ్ను', బిగ్ బిఅమితాబ్ బచ్చన్‌తో 'గుడ్ బై'తో పాటు మరో సినిమాకి సైన్ చేసింది. ఇటీవలే కార్తీ నటించిన సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన రష్మిక త్వరలో 'తలపతి' విజయ్‌తో నటించబోతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హింట్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ సెషన్‌లో రష్మిక తన అభిమానులతో ముచ్చటించింది. 

'ఆస్క్ మీ ఎనీథింగ్' అనగానే ఓ అభిమాని 'తలపతి విజయ్‌తో నటించే అవకాశం ఉందా ?' అని ప్రశ్నించాడు. "అతి త్వరలో" అంటూ సమాధానమిచ్చింది రష్మిక. తలపతి విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంటుందట. ఈ పాత్ర కోసం మేకర్స్ రష్మికతో చర్చలు జరిపారని సమాచారం. రష్మిక హింట్ ఇచ్చింది 'బీస్ట్' సినిమా గురించేనా.. లేక విజయ్‌తో మరో సినిమాలో కలిసి నటించబోతోందా అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.