ఊ అంటావా రష్మీ.. ఊఊ అంటావా విష్ణు!

ABN , First Publish Date - 2022-01-17T18:19:15+05:30 IST

‘పుష్ప’ చిత్రంలో సమంత చేసిన ఐటెమ్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ ఎంతగా ట్రెండ్‌ అయిందో తెలిసిందే. ఈ మఽధ్యకాలంలో ఎక్కడ విన్నా ఇదే పాట. ఈ పాటతో బుల్లితెర వీక్షకులను ఉర్రూతలూగించారు టీవీ యాంకర్లు. అనసూయతోపాటు టీవీ రంగంలో హాట్‌ యాంకర్‌గా గుర్తింపు పొందారు రష్మీ గౌతమ్‌. ఆమెకు డాన్స్‌ అంటే పిచ్చి. తాను యాంకర్‌గా చేసే పలు షోలలో అప్పుడప్పుడు కాలు కదుపుతుంటుంది.

ఊ అంటావా రష్మీ.. ఊఊ అంటావా విష్ణు!

‘పుష్ప’ చిత్రంలో సమంత చేసిన ఐటెమ్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ ఎంతగా ట్రెండ్‌ అయిందో తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా ఇదే పాట. ఈ పాటతో బుల్లితెర వీక్షకులను ఉర్రూతలూగించారు టీవీ యాంకర్లు. అనసూయతోపాటు టీవీ రంగంలో హాట్‌ యాంకర్‌గా గుర్తింపు పొందారు రష్మీ గౌతమ్‌. ఆమెకు డాన్స్‌ అంటే పిచ్చి. తాను యాంకర్‌గా చేసే పలు షోలలో అప్పుడప్పుడు కాలు కదుపుతుంటుంది. సంక్రాంతి సందర్భంగా ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో ప్రసారమైన సంక్రాంతి ఈవెంట్‌ షోలో ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ పాటకు స్టెప్పులేసి అలరించారు. పొట్టి దుస్తుల్లో రష్మీ అందాలకు, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు, డాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రష్మీ అదరహో అని కామెంట్లు పెడుతున్నారు. 




మరో హాట్‌ బ్యూటీ విష్ణుప్రియ మరో షోలో ఇదే పాటకు రష్మీని మించిన ఎనర్జీతో ఆడి అలరించింది. ఆర్టిస్ట్‌, యాంకర్‌ వర్ష ‘పుష్ప’లోని ‘సామి సామి’ పాటకు స్టెప్పులేసి అలరించింది. తన హవభావాలతో యువత హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. 




Updated Date - 2022-01-17T18:19:15+05:30 IST