అరుదైన కాంబినేషన్‌ సెట్టయింది

ABN , First Publish Date - 2021-09-16T06:30:29+05:30 IST

‘‘అంధాధున్‌’ను రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు కొంచెం భయం వేసింది. ‘ప్రయోగాలు చేయడం ఎందుకు? రొటీన్‌ కమర్షియల్‌ చిత్రాలు చేసుకోవచ్చు కదా!’ అనిపించింది. కానీ నటనా ప్రాధాన్య పాత్రలు పోషించాలని...

అరుదైన కాంబినేషన్‌ సెట్టయింది

‘‘అంధాధున్‌’ను రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు కొంచెం భయం వేసింది. ‘ప్రయోగాలు చేయడం ఎందుకు? రొటీన్‌ కమర్షియల్‌ చిత్రాలు చేసుకోవచ్చు కదా!’ అనిపించింది. కానీ నటనా ప్రాధాన్య పాత్రలు పోషించాలని చేశాను’’ అని నితిన్‌ అన్నారు. ఆయన హీరోగా సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మించిన ‘మాస్ట్రో’ శుక్రవారం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుకలో నితిన్‌ మాట్లాడుతూ ‘‘మా దర్శకుడు మేర్లపాక గాంఽధీ మాతృకను యధాతథంగా కాపీ చేయలేదు. ఎక్కువ మార్పులు చే యలేదు. ఆ రెండింటినీ బ్యాలన్స్‌ చేస్తూ, వినోదాత్మకంగా తెరకెక్కించారు. నటీనటుల పరంగా అరుదైన కాంబినేషన్‌ ‘మాస్ట్రో’కు సెట్టయింది’’ అన్నారు. ‘‘నితిన్‌తో రొమాంటిక్‌ మూవీ చేస్తాననుకున్నా. కానీ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చే శాను’’ అని తమన్నా చెప్పారు. ‘‘ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా థ్రిల్లింగ్‌ అంశాలతో తెరకెక్కిన చిత్రమిది’’ అని నిఖితా రెడ్డి చెప్పారు. ‘‘చిత్రంలో కొత్త నితిన్‌ను చూస్తారు. తమన్నా గొప్ప నటి అని రుజువవుతుంది’’ అని మేర్లపాక గాంధీ అన్నారు. సీనియర్‌ నరేశ్‌, నభా నటేశ్‌, రాజ్‌కుమార్‌ ఆకెళ్ల పాల్గొన్నారు.


Updated Date - 2021-09-16T06:30:29+05:30 IST