Khiladi : రాజశేఖర్‌గా రావు రమేశ్

ABN , First Publish Date - 2022-02-07T15:25:25+05:30 IST

మాస్ మహారాజ రవితేజ, రమేశ్ వర్మ కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఖిలాడి’. ఈ నెల 11న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని పాత్రలు, పాత్రధారుల్ని పరిచయం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకూ మురళిశర్మ, అనసూయ, సచిన్ కేడ్కర్, అర్జున్ సర్జా లాంటి వారి పాత్రలు పరిచయం చేయగా.. తాజాగా ఇందులో రాజశేఖర్ అనే పాత్ర చేస్తున్న రావు రమేశ్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రత్యేక పోస్టర్ వదిలారు. రాజశేఖర్ గా రావు రమేశ్ గెటప్ మెప్పిస్తోంది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే సత్తా ఉన్న ఆయన రాజశేఖర్ గా ఓ పెక్యులర్ కేరక్టర్ ను చేస్తున్నట్టు తెలుస్తోంది.

Khiladi : రాజశేఖర్‌గా రావు రమేశ్

మాస్ మహారాజ రవితేజ, రమేశ్ వర్మ కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఖిలాడి’. ఈ నెల 11న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని పాత్రలు, పాత్రధారుల్ని పరిచయం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకూ మురళిశర్మ, అనసూయ, సచిన్ కేడ్కర్, అర్జున్ సర్జా లాంటి వారి పాత్రలు పరిచయం చేయగా.. తాజాగా ఇందులో రాజశేఖర్ అనే పాత్ర చేస్తున్న రావు రమేశ్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రత్యేక పోస్టర్ వదిలారు. రాజశేఖర్ గా రావు రమేశ్ గెటప్ మెప్పిస్తోంది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే సత్తా ఉన్న ఆయన రాజశేఖర్ గా ఓ పెక్యులర్ కేరక్టర్ ను చేస్తున్నట్టు తెలుస్తోంది. కథకు కీలకమైన పాత్రను రావు చేస్తున్నట్టు సమాచారం. 


డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. ఈ రెండు పాత్రలతోనూ రవితేజ ఎంతో వేరియేషన్స్ చూపించారట. గతేడాది ‘క్రాక్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ.. ఈ ఏడాది ‘ఖిలాడి’ చిత్రంతో మళ్ళీ అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటారని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. మరి ‘ఖిలాడి’ రవితేజ ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.  



Updated Date - 2022-02-07T15:25:25+05:30 IST