దీపావళికి ‘ఆణ్ణాత్త’!


రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వం వహిస్తున్న ‘అణ్ణాత్త’ సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీపావళి కానుకగా నవంబర్‌ 4న సినిమాను విడుదల చేస్తున్నట్లు గురువారం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనా, కుష్భూ, నయనతారా, కీర్తి సురేశ్‌, జగపతిబాబు, జాకీష్రాఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమాన్‌ సంగీతం స్వరకర్త. కళానిధి మారన్‌  నిర్మాత. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.