రాణీ ముఖర్జీ ‘మిసెస్ చటర్జీ vs నార్వే’ ఎస్టోనియా షెడ్యూల్ పూర్తి

ABN , First Publish Date - 2021-09-21T18:09:12+05:30 IST

బిఫోర్ లాస్టియర్ ‘మర్దానీ 2’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఫిల్మ్ ఫేర్ అవార్డు సైతం కైవసం చేసుకుంది బాలీవుడ్ నటీమణి రాణీ ముఖర్జీ. ఈ ఏడాది ఆమె నటించిన ‘బంటీ అవుర్ బబ్లీ 2’ విడుదలకు సిద్ధం కాగా.. ప్రస్తుతం ‘మిసెస్ చటర్జీ vs నార్వే’ అనే డిఫరెంట్ మూవీతో బిజీగా ఉంది.

రాణీ ముఖర్జీ ‘మిసెస్ చటర్జీ vs నార్వే’ ఎస్టోనియా షెడ్యూల్ పూర్తి

బిఫోర్ లాస్టియర్ ‘మర్దానీ 2’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఫిల్మ్ ఫేర్ అవార్డు సైతం కైవసం చేసుకుంది బాలీవుడ్ నటీమణి రాణీ ముఖర్జీ.  ఈ ఏడాది  ఆమె నటించిన ‘బంటీ అవుర్ బబ్లీ 2’ విడుదలకు సిద్ధం కాగా.. ప్రస్తుతం ‘మిసెస్ చటర్జీ vs నార్వే’ అనే డిఫరెంట్ మూవీతో బిజీగా ఉంది.  మోనీషా అద్వానీ, మధు బోజ్వానీ, నిఖిల్ అద్వానీ.. ఈ సినిమాని ఎమ్మే ఎంటర్ టైన్ మెంట్స్ అండ్ జీ స్టూడియోస్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అషిమా చిబ్బర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ఎస్టోనియా లో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.


ఎస్టోనియాలో ఒక నెల రోజుల పాటు షూటింగ్ జరుపుకొన్న ఈ షెడ్యూల్ .. కంప్లీట్ అయినట్టు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు. బయో బబుల్ లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఈ సినిమా టీమ్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక దేశం మీద ఓ తల్లి చేసే పోరాటమే .. ‘మిసెస్ చటర్జీ vs నార్వే’ మూవీ కథాంశం. ఇక ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఇండియాలో మొదలు కాబోతోంది. 

Updated Date - 2021-09-21T18:09:12+05:30 IST