సెట్స్‌పైకి రాబోతున్న 'రంగమార్తాండ'..?

'రంగమార్తాండ' సెట్స్‌పైకి రాబోతుందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియూలో చక్కర్లు కొడుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గత ఏడాదే పూర్తి కావాల్సింది. కరోనా కారణంగా ఆగిపోయింది. ఇక ఈ ఏడాది దాదాపు చిత్రీకరణ పూర్తయ్యే సమయంలో మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్నీ సినిమాలతో పాటే దీని చిత్రీకరణ కూడా ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గుతుండంతో మళ్ళీ టాలీవుడ్ చిత్రాలు షూటింగ్‌కి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్', సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో నిర్మిస్తున్న రెండు సినిమాలతో పాటు నాని సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యాయి. 

ఈ క్రమంలో 'రంగమార్తాండ' బ్యాలెన్స్ షూటింగ్ కోసం జూలై మొదటివారం నుంచి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట కృష్ణవంశీ. ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ కీలక పాత్రల్లో.. బ్రంహానందం, అనసూయ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను మరాఠీ హిట్ సినిమా 'నట సామ్రాట్‌'కి రీమేక్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ 'అన్నం' అనే మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.