వైరల్ అవుతున్న Ranbir Kapoor, Alia Bhatt పెళ్లి వీడియో.. మోకాళ్లపై కూర్చొని.. పెదవులపై ముద్దుపెట్టి..
ABN , First Publish Date - 2022-04-15T16:49:24+05:30 IST
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లితో ఒకటైన విషయం తెలిసిందే...

బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లితో ఒకటైన విషయం తెలిసిందే. కేవలం బంధుమిత్రుల ఆధ్వర్యంలో మాత్రమే జరిగిన వీరి పెళ్లి పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అలియా అధికారికంగా కన్‌ఫార్మ్ చేసింది. ఇప్పటికే వీరి పెళ్లి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ కపుల్‌కు సంబంధించి ఓ వీడియో నెట్టింట ప్రత్యక్షం అయ్యింది. అది కూడా వైరల్‌గా మారింది.
అందులో.. వధువు అలియా, వరుడు రణ్‌బీర్ మెడలో వరమాల వేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో రణ్‌బీర్ బంధువులు ఆయన్ని అలియాకి అందకుండా పైకి ఎత్తుకున్నారు. కొద్దిసేపు అలా సరదాగా ఆటపట్టించిన తర్వాత కిందికి దింపారు. దీంతో వెంటనే రణ్‌బీర్ తన మోకాళ్ల కూర్చొని వరమాల వేయించుకున్నాడు. అనంతరం పెదవులపై ముద్దుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్‌గా మారింది. ఆ కపుల్ క్యూట్ మ్యారేజ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
ఈ వీడియోపై ఎంతో మంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరూ సో క్యూట్ అంటూ.. వారిద్దరి మధ్య లవ్ చూస్తుంటే ముచ్చట వేస్తుందని మరికొందరూ.. రోమియోలాంటి రణ్‌బీర్ ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడని ఇంకొందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ కపుల్ క్యూట్ మ్యారేజ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..