అలియా లెహంగాని కాలితో తన్నిన Ranbir Kapoor.. అతన్ని వదిలేయి అంటూ నెటిజన్లు ట్రోలింగ్

ABN , First Publish Date - 2021-12-01T18:33:11+05:30 IST

బాలీవుడ్‌లో ఎంతో పాపులారిటీ ఉన్న కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంట ఒకటి. వారు ఏం చేసినా అది వైరల్‌గా మార్చేస్తుంటారు ఫ్యాన్స్.

అలియా లెహంగాని కాలితో తన్నిన Ranbir Kapoor.. అతన్ని వదిలేయి అంటూ నెటిజన్లు ట్రోలింగ్

బాలీవుడ్‌లో ఎంతో పాపులారిటీ ఉన్న కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంట ఒకటి. వారు ఏం చేసినా అది వైరల్‌గా మార్చేస్తుంటారు ఫ్యాన్స్. ఎన్నో సార్లు ఒకరి ఇంటి ఫంక్షన్లకి మరొకరు అటెండ్ అయినప్పటకీ.. ఎంతో కాలం వారి రిలేషన్ గురించి బయటికి చెప్పకుండా గుట్టుగా ఉంచింది ఈ జంట. అయితే గత నెల దీపావళి సందర్భంగా వారి మధ్య ప్రేమ గురించి తెలిపి ఫ్యాన్స్ ఆనందంలో ముంచింది అలియా. అయితే తాజాగా ఓ పని చేసి ట్రోలింగ్‌కి గురయ్యాడు ఈ చాక్లెట్ బోయ్.


రణ్‌బీర్, అలియా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మాస్ర్త’. ఆ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ.. దీపావళికి ఉత్తర బాంబేలోని సర్బోజనిన్ దుర్గా పూజ సమితిలోని కాళి మాత ఆశ్శీసుల కోసం వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అందులో రణ్‌బీర్, అలియా స్టేజ్‌ పైనుంచి కిందకి దిగుతున్నారు. ఆ సమయంలో అలియా లెహంగా చున్నీ కిందపడింది. వెనుకనే ఉన్న ఈ కుర్ర హీరో అది గమనించి దాన్ని గట్టిగా కిందికి తన్నేశాడు. దీంతో ఎంతో అమర్యాదగా ప్రవర్తించాడంటూ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.


‘అలా తన్నడం చూస్తే అతని ప్రియురాలిపై మర్యాద లేదనే విషయం అర్థమవుతోంద‌’ని కొందరు రాశారు. ‘రణ్‌బీర్‌కి రిలేషన్‌షిప్‌పై ఏ మాత్రం గౌరవం లేదని, ఏ మహిళ దుస్తులతో అలా చేయొద్దం’ మరి కొందరు కామెంట్స్ చేయగా.. ‘ఆయన ఎంతో అమర్యాదకరమైన వ్యక్తి’, ‘మాటల కంటే చర్యలు చాలా గట్టి ప్రభావాన్ని చూపిస్తాయి’ అంటూ ఇంకొందరు కామెంట్స్‌లో రణ్‌బీర్‌ని విమర్శిస్తున్నారు.


ఒక నెటిజన్ అయితే ఏకంగా మరో మంచి వ్యక్తిని చూసుకోమంటూ సలహా ఇచ్చాడు. ‘అతను లెహెంగాని తన్నడం చూస్తే, అలియాతో ప్రేమపై ఏమాత్రం గౌరవం లేదు. అతను తన గురించి తప్ప మరెవరి గురించి పట్టించుకోడు. అలియాతో బంధాన్ని చాలా చీప్‌గా చూస్తున్నాడు. కాబట్టి అతన్ని వదిలేసే నీకు గౌరవం ఇచ్చే మంచి వ్యక్తిని చూసుకో’ అంటూ కామెంట్ పెట్టాడు.



Updated Date - 2021-12-01T18:33:11+05:30 IST