2023లో యానిమల్
ABN , First Publish Date - 2021-11-20T06:23:38+05:30 IST
తొలిచిత్రం ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌లో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ వంగా. రణ్‌బీర్‌కపూర్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’....

తొలిచిత్రం ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌లో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ వంగా. రణ్‌బీర్‌కపూర్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’. 2023 ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాణసంస్థల్లో ఒకటైన టీసిరీస్ శుక్రవారం ప్రకటించింది. క్రైమ్‌డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనిల్‌కపూర్, బాబీడియోల్, పరిణీతిచోప్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, సినీవన్ స్టూడియోస్‌తో కలసి టీ సిరీస్ నిర్మిస్తోంది.