Rana Naidu: పూర్తి చేశారు..

ABN , First Publish Date - 2022-05-27T17:02:53+05:30 IST

డిజిటల్ ఎంట్రీ ఇస్తూ దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu).

Rana Naidu: పూర్తి చేశారు..

డిజిటల్ ఎంట్రీ ఇస్తూ దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). వీరిద్దరితో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయాలని ఎప్పటినుంచో నిర్మాత సురేశ్ బాబు (Suresh Babu) ప్లాన్ చేశారు. కానీ, ఇద్దరు హీరోలకు సరిపోయే కథ సెట్ కాకపోవడంతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్స్ అలా ఉండిపోయాయి. అయితే, వెబ్ సిరీస్‌కు మాత్రం సాలీడ్ స్టోరీ కుదరడంతో వెంకీ - రానా కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 


ఈ మధ్య దీనికి సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ రాకపోవడంతో రానా నాయుడు (Rana Naidu) ఆగిపోయిందా..! అనే సందేహాలు చాలామందిలో కలిగాయి. తాజాగా మేకర్స్ దీనికి చెక్ పెడుతూ అప్‌డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చిత్రీకరణ కంప్లీట్ అయింది. హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో షూటింగ్ చేసుకున్నటువంటి ఈ వెబ్ సిరీస్‌పై వెంకీ చాలా నమ్మకంగా ఉన్నారు. కాగా, రానా నాయుడు వెబ్ సీరీస్‌ను అమెరికన్ సిరీస్ రే డోనోవన్ (Ray Donovan) ఆధారంగా రూపొందిస్తున్నారు. 


ఈ కాన్సెప్ట్ నచ్చడంతో వెంకటేష్ - రానా డిజిటల్ ఎంట్రీకి ఇదే కరెక్ట్ అని కమిటయ్యారట. ఇక ఈ సిరీస్ షూటింగ్ ముగిసినట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించగా, వచ్చే ఏడాది ప్రారంభంలో స్ట్రీమింగ్‌కు తీసుకువస్తారని సమాచారం. అభిషేక్ భాలేరావ్, సౌరవ్ ఖురానా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. లోకోమోటివ్ గ్లోబల్ ఇంక్ ప్రొడక్షన్ దీనిని నిర్మిస్తోంది. కాగా, వెంకటేశ్ (Venkatesh) - వరుణ్ తేజ్ (Varun Tej)- తమన్నా (Tamannah) - మెహ్రీన్ (Mehreen) హీరోహీరోయిన్స్‌గా నటించిన భారీ మల్టీస్టారర్ ఎఫ్ 3 (F 3) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.  

Updated Date - 2022-05-27T17:02:53+05:30 IST