Rana Daggubati: పెళ్లి తర్వాత ఈ పనేంటి.. రానా?

ABN , First Publish Date - 2022-09-26T20:21:30+05:30 IST

పెళ్లి తర్వాత ఈ పనేంటి రానా? అని సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు దగ్గుబాటి రానా (Rana Daggubati)పై కామెంట్స్ చేస్తున్నారు. బాబాయ్ వెంకటేష్ (Venkatesh), అబ్బాయ్ రానా..

Rana Daggubati: పెళ్లి తర్వాత ఈ పనేంటి.. రానా?

పెళ్లి తర్వాత ఈ పనేంటి రానా? అని సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు దగ్గుబాటి రానా (Rana Daggubati)పై కామెంట్స్ చేస్తున్నారు. బాబాయ్ వెంకటేష్ (Venkatesh), అబ్బాయ్ రానా (Rana) కలిసి ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్ సిరీస్‌ (Web Series)లో నటిస్తోన్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ వెబ్ సిరీస్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది. అమెరికన్ సిరీస్ ‘రే డోనోవాన్’ (ray donovan) కి ఇండియన్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ వర్మ దర్శకులు. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో బాబాయ్ మేకోవర్‌తో వావ్ అనిపిస్తే.. అబ్బాయ్ యాక్షన్‌, ఘాటైన లిప్‌లాక్‌ (Liplock)లతో టీజర్ రూపాన్నే మార్చేశాడు. ప్రస్తుతం ఈ టీజర్‌ విషయంలో ఆసక్తికరంగా చర్చ జరుగుతున్న అంశం ఏమిటంటే.. రానా లిప్‌లాక్.


ఎందుకంటే.. ఇప్పటి వరకు రానా నటించిన చిత్రాలలో పెద్దగా హీరోయిన్‌తో లిప్‌లాక్ చేసింది లేదు. రామ్‌గోపాల్ వర్మ (RGV) ‘డిపార్ట్‌మెంట్’ సినిమాలో నథాలియాతో కలిసి రొమాంటిక్ సీన్స్‌లో నటించిన రానా.. ఆ తర్వాత వాటికి జోలికి పెద్దగా పోలేదు. ఆ మధ్య బాలీవుడ్ సినిమాలో బిపాసాబసుతో రొమాన్స్ చేసే ఛాన్స్ వచ్చినా కూడా.. ఆమె లిప్‌ని మాత్రం రానా లాక్ చేయలేదు. మొదటి నుండి హీరోయిన్ల విషయంలో రానా దారి వేరుగా ఉండేది. అందుకు కారణం ఆయన ఎన్నుకునే పాత్రలే. రొటీన్‌గా కాకుండా.. రానా ఎప్పుడూ వైవిధ్యతకు చోటిస్తుంటాడు. అందుకే.. ఇలాంటి వాటిపై పెద్దగా ఆయన ఫోకస్ పెట్టినట్లుగా అనిపించడు. కానీ, ఇప్పుడు వెబ్ సిరీస్ కోసం.. ఇంత ఘాటుగా సీన్‌లోకి దిగడంతో.. సోషల్ మీడియా అంతా రానా ముద్దు గురించే మాట్లాడుకుంటున్నారు. పెళ్లికి ముందు, తర్వాత చేసిన సినిమాలలో కూడా రానా ఇటువంటి వాటితో ఎంటర్‌టైన్ చేయలేదు. కానీ సడెన్‌గా రానా ఇలా రంగంలోకి దిగడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే. అయితే, ఈ వెబ్ సిరీస్ ఒరిజినల్ వెర్షన్‌లో అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. అది మొత్తం దించకపోయినా.. ఎంతో కొంత ఈ సిరీస్‌లోనూ వాడేసి ఉంటారనేదానికి నిదర్శనమే.. ఈ లిప్‌లాక్ అనేలా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఈ లిప్‌లాక్‌పై నెటిజన్లు చేస్తున్న కామెంట్ ఏమిటీ అంటే.. ‘పెళ్లి తర్వాత ఈ పనేంటి రానా?’ అంటూ రానా లిప్ లాక్ చేస్తున్న పిక్‌ని వైరల్ చేస్తున్నారు.



Updated Date - 2022-09-26T20:21:30+05:30 IST