‘స్టాండప్‌ రాహుల్‌’ టీజర్‌ వదిలారు

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ స్టాండప్‌ కమెడియన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. ఫీల్‌ గుడ్‌ రొమాన్స్‌ కామెడీ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్, హైఫైవ్‌ పిక్చర్స్‌ పతాకాలపై సాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వంలో నందకుమార్‌ అభినేని, భరత్‌ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా హాస్యభరితంగా ఉంది.


టీజర్‌ విషయానికి వస్తే.. స్టేజ్‌పై రాజ్‌తరుణ్‌ స్టాండప్‌ కమెడియన్‌గా.. పిలిచినా పిలవక పోయినా వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం అని చెప్పే డైలాగ్ తో టీజర్‌ మొదలవుతుంది. సినిమాలోని ఓ పాపులర్‌ స్టాండప్‌ కమెడియన్‌ స్టాండప్‌ కామెడీకీ ఓరిజినాలిటీ చాలా ముఖ్యమని చెబుతుంటాడు. కానీ రాజ్‌తరుణ్‌ అవుట్‌ డేటెడ్‌ జోక్స్‌ వినిపిస్తూ తన చుట్టూ ఉన్న వారిని విసిగిస్తున్నట్లు ఈ టీజర్‌లో చూపించారు. ఇక బాత్‌రూమ్ సన్నివేశంలో రాజ్‌ తరుణ్, హీరోయిన్ వర్షా బొల్లమ్మల మధ్య సన్నివేశం, నవ్వించాలంటే ముందు ఏడుపేంటో తెలియాలి అనే డైలాగ్, అలాగే వెన్నెల కిశోర్‌ క్యారెక్టర్‌ చూస్తుంటే.. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.