రానా చేతుల మీదుగా ‘11:11’ మోషన్ పోస్టర్

ABN , First Publish Date - 2022-01-26T21:37:59+05:30 IST

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్, వర్ష విశ్వనాథ్ జంటగా రూపొందుతోన్న డిఫరెంట్ మూవీ ‘11: 11’. టైగర్ హిల్స్ ప్రొడక్షన్స్, స్వస్తిక ఫిలిమ్స్ బ్యానర్స్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని గాజుల వీరేష్ నిర్మిస్తున్నారు. సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.

రానా చేతుల మీదుగా ‘11:11’ మోషన్ పోస్టర్

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్, వర్ష విశ్వనాథ్ జంటగా రూపొందుతోన్న డిఫరెంట్ మూవీ ‘11: 11’. టైగర్ హిల్స్ ప్రొడక్షన్స్, స్వస్తిక ఫిలిమ్స్ బ్యానర్స్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని గాజుల వీరేష్ నిర్మిస్తున్నారు. సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. అందులో భాగంగా..  స్టార్ హీరో దగ్గుబాటి రానా ‘11: 11’ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదలయిన ఈ వీడియో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.


ఈ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్‌లో కేవలం మూడు క్యారెక్టర్స్ చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. హీరో రాజీవ్, హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం లాంటి సీన్స్ ఈ వీడియోలో కనిపిస్తాయి. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌కి తోడు మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఈ వీడియోకే హైలైట్స్. గతంలో ‘11: 11’ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసి చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు మోషన్ పోస్టర్ విషయంలో రానా సపోర్ట్ దొరికింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించాలని రానా కోరుకున్నారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్‌డేట్స్ ప్రకటించనున్నారు మేకర్స్.



Updated Date - 2022-01-26T21:37:59+05:30 IST