డి-గ్లామర్‌ రోల్‌లో రమ్యాపాండ్యన్‌

ABN , First Publish Date - 2021-09-23T16:39:59+05:30 IST

‘జోకర్‌’, ‘ఆణ్‌దేవతై’ వంటి చిత్రాల్లో నటించిన నటి రమ్యాపాండ్యన్‌కు తర్వాత పెద్దగా సినీ అవకాశాలు రాలేదు. దీంతో ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షోలో పాల్గొని ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

డి-గ్లామర్‌ రోల్‌లో రమ్యాపాండ్యన్‌

‘జోకర్‌’, ‘ఆణ్‌దేవతై’ వంటి చిత్రాల్లో నటించిన నటి రమ్యాపాండ్యన్‌కు తర్వాత పెద్దగా సినీ అవకాశాలు రాలేదు. దీంతో ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షోలో పాల్గొని ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ‘కుక్‌విత్‌ కోమాలి’ అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల కంటే ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఈమెకు మంచి క్రేజ్‌ వచ్చింది. ప్రస్తుతం హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నిర్మించిన ‘రామే ఆండాలుమ్‌ రావణే ఆండాలుమ్‌’ అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. 


ముఖ్యంగా డిగ్లామర్‌ పాత్రలో కనీసం పౌడర్‌ కూడా ముఖానికి పూసుకోకుండా పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే, సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా వుండే రమ్యాపాండ్యన్‌ తన కొత్త చిత్రం ప్రచారంలోనూ నిమగ్నమైవుంది. అదేసమయంలో ప్రత్యేక ఫొటోషూట్‌ కార్యక్రమాల్లోనూ నిమగ్నమై తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో దిగిన గ్లామర్‌ ఫొటోషూట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 


Updated Date - 2021-09-23T16:39:59+05:30 IST