వర్మ ‘కొండా’ చిత్రం ట్రైలర్ వచ్చేస్తోంది

ABN , First Publish Date - 2022-01-25T16:13:05+05:30 IST

దర్శకుడు రాంగోపాల్ వర్మ "కొండా" చిత్రం ట్రైలర్ జనవరి 26th, రిపబ్లిక్ డే రోజు ఉదయం 10గంటల 25 నిముషాలకి విడుదల కాబోతోంది. ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏమిటంటే, యెన్నో సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 26th, రిపబ్లిక్ డే రోజున 10గంటల 25 నిముషాలకి కొండా మురళి పైన వంచనగిరిలో, హత్య ప్రయత్నం జరిగింది...కొండా బ్రతికి పోయినప్పటికి, ఆ దాడికి సంబందించిన కొన్ని బుల్లెట్ లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండి పోయాయి. ఆ బుల్లెట్‌లకి ముందు కథ, వాటి తర్వాత కథే, మా కొండా కథ.. అంటూ వర్మ తన వాయిస్ ఓవర్ ద్వారా తన సినిమా అప్డేట్ ని సోషల్ మీడియా లో ప్రేక్షకులతో పంచుకున్నారు.

‘కనీవినీ ఎరుగని అసాధారణ పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ శక్తులుగా మారతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి. కొండా లాంటి అసాధారణ శక్తికి, ఆదిపరాశక్తిలాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరినీ చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్రమైన కుట్రను తిప్పికొడుతూ.. తెలంగాణాలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్ధమే.. మా ‘కొండా’ చిత్రం’ అంటూ వర్మ తనదైన శైలిలో ఆసక్తికరంగా తన వాయిస్ ను వినిపించారు. ఇంకా కొండా సినిమా కథ వెనుక విశేషాల్ని వినిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వాయిస్ ఓవర్ వైరల్ అవుతోంది.  

Updated Date - 2022-01-25T16:13:05+05:30 IST