జంధ్యాల దర్శకత్వంలోనూ నటించిన రమేశ్ బాబు

ABN , First Publish Date - 2022-01-09T17:27:24+05:30 IST

హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో రమేశ్ బాబు నటించిన ఏకైక చిత్రం ‘చిన్నికృష్ణుడు’. అమెరికా నేపథ్యంలో ‘పడమటి సంధ్యారాగం’ తర్వాత జంధ్యాల తెరకెక్కించిన మరో చిత్రం ఇది. విజయా సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్బారావు నిర్మించిన ఈ సినిమా 1988లో విడుదలైంది. ఫ్యామిలీ రిలేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ పై ఈ సినిమా రూపొందినప్పటికీ.. ఇందులో జంధ్యాల మార్క్ కామెడీకి కొదవే లేదు. రమేశ్ బాబు, ఖుష్బూ జంటగా నటించిన ఈ సినిమాలో రమేశ్ తండ్రిగా శరత్ బాబు, తల్లిగా భారతి నటించారు.

ఈ సినిమాకి సంబంధించిన మరో ప్రత్యేకత ఏంటంటే.. దీనికి బాలీవుడ్ సంగీత దిగ్గజం ఆర్.డీ బర్మన్ సంగీతం అందించారు. ఇందులోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆశాభోంస్లే పాడిన ‘జీవితం సప్తసాగర గీతం’ అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. విడిపోయిన తల్లిదండ్రుల్ని కలిపే ఒక యువకుని కథే ఈ సినిమా. అమెరికాలో ఉన్న తండ్రి శరత్ బాబుని, ఇండియాలో ఉన్న తల్లి భారతిని కలపడానికి తనయుడు రమేశ్ బాబు ఎలాంటి ప్రయత్నం చేశారు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. అప్పటి ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంతగానో అలరించింది.   

Updated Date - 2022-01-09T17:27:24+05:30 IST