సమంత గురించి మూడు మాటల్లో: రామ్‌చరణ్‌

ABN , First Publish Date - 2021-12-28T01:38:01+05:30 IST

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్‌ క్లోజ్‌ అయిపోతుందని అందరూ భావించారు. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సమంత దూసుకెళ్తున్నారు. ఇటు తెలుగు, తమిళ చిత్రాలు చేస్తూ, బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాల్లోనూ అవకాశం దక్కించుకుంది. విడాకుల బాధతో చనిపోతానేమో అనుకున్న సమంత తన బలం ఏంటో తెలుసుకుని జీవితం సాగిస్తున్నారు.

సమంత గురించి మూడు మాటల్లో: రామ్‌చరణ్‌

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్‌ క్లోజ్‌  అయిపోతుందని అందరూ భావించారు. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సమంత దూసుకెళ్తున్నారు. ఇటు తెలుగు, తమిళ చిత్రాలు చేస్తూ,  బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాల్లోనూ అవకాశం దక్కించుకుంది. విడాకుల బాధతో చనిపోతానేమో అనుకున్న సమంత తన బలం ఏంటో తెలుసుకుని జీవితం సాగిస్తున్నారు. ఈ తరుణంలో హీరో రామ్‌చరణ్‌ సమంత గురించి మూడు ముక్కలో ఓ మాట చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ రాజమౌళి ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సమంత గురించి చెప్పమని యాంకర్‌ అడగగానే.. దానికి సమంత ‘కమ్‌ బ్యాక్‌.. బిగ్గర్‌.. స్ర్టాంగర్‌..’ అని మూడు ముక్కల్లో చెప్పారు రామ్‌ చరణ్‌. ఈ మాటలు విన్న సామ్‌ తెగ సంతోషపడిపోతుంది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. 


Updated Date - 2021-12-28T01:38:01+05:30 IST