అక్షయ్ కుమార్ ‘Ram Setu’: ఊటీ షెడ్యూల్ పూర్తి

‘రామ్ సేతు’ మూవీ ఊటి షెడ్యూల్ పూర్తయినట్లుగా తెలుపుతూ అక్షయ్ కుమార్ లొకేషన్‌కి సంబంధించి ఓ అద్భుతమైన పిక్‌ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నుమ్రత్‌, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం ‘రామ్‌ సేతు’. అయోధ్యలో మార్చి 2021లో ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత ముంబైలో జరిగిన లాంగ్ షెడ్యూల్ షూట్‌లో యూనిట్‌లోని కొందరికి కరోనా మహమ్మారి సోకడంతో కొన్ని రోజుల పాటు వాయిదా పడింది. ఇటీవలే మళ్లీ షూటింగ్ మొదలైన ఈ చిత్రం ప్రస్తుతం ఊటీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ ఎండింగ్ నుండి గుజరాత్‌లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. డిసెంబర్‌ నాటికి షూటింగ్ పూర్తి చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఈ చిత్రంలో పురావస్తు శాస్త్రవేత్తగా అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. తెలుగు నటుడు సత్యదేవ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 

‘‘ఫోటోలో అయినా లేదా జీవితంలో అయినా చీకటి మేఘాలపై ఎల్లప్పుడూ అందమైన కాంతిరేఖ ఉంటుంది. రామ్ సేతు ఊటీ షెడ్యూల్ పూర్తయింది. మంచి, చెడులలో ఆ దైవకాంతి మమ్మల్ని ఎల్లప్పుడూ ధైర్యంగా ముందుకు నడుపుతుందని భావిస్తున్నాను..’’ అని తెలుపుతూ జాక్వలిన్, సత్యదేవ్‌తో కలిసున్న ఫొటోని అక్షయ్ కుమార్ పోస్ట్ చేశారు.


Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.