ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా ప్రస్తుతం ‘ది వారియర్’ (The Warriorr) సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) సినిమాతో సాలీడ్ మాస్ హిట్ అందుకున్న రామ్ కెరీర్‌లో ఎప్పుడూ రానంత మాస్ హీరో ఇమేజ్ వచ్చేసింది. దాంతో వరుసగా మాస్ ఎంటర్‌టైనర్స్ చేసేందుకే రామ్ ఆసక్తి చూపిస్తున్నాడు. తమిళ యాక్షన్ చిత్రాల దర్శకుడు ఎన్.లింగుసామి (N. Lingusamy) దర్శకత్వంలో చేస్తున్న ‘ది వారియర్’ రెండు భాషలలో రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అక్షర గౌడ, ఆదిపినిశెట్టి, నదియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన బుల్లెట్ సాంగ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత కూడా రామ్ పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌నే చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. అయితే, తాజా సమాచారం మేరకు జూన్ 1వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుందట. ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను అదే జోష్‌లో రామ్ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఈ సినిమాను కూడా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండటం విశేషం.