రామ్ - ఎన్ లింగుసామి మూవీ లేటెస్ట్ అప్‌డేట్

రామ్ - ఎన్ లింగుసామి మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని - కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి కాంబినేషన్‌లో ఓ సినిమాను అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా రెగ్యులర్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. ఈ మధ్య జూలై నెలలో మొదలవనుందనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ జూలై 12వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు వెల్లడించారు. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.