Sarkaru Vaari Paata: బాలీవుడ్‪పై చెలరేగిపోతోన్న వర్మ

ABN , First Publish Date - 2022-05-18T03:12:10+05:30 IST

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‪గా మారిన ఆయన.. ఈ మధ్య కాలంలో ఎటువంటి విషయాలపైనా

Sarkaru Vaari Paata: బాలీవుడ్‪పై చెలరేగిపోతోన్న వర్మ

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‪గా మారిన ఆయన.. ఈ మధ్య కాలంలో ఎటువంటి విషయాలపైనా పెద్దగా స్పందించట్లేదు కానీ.. బాలీవుడ్ (Bollywood)‪ని మాత్రం వరస ట్వీట్స్‪తో రఫ్ఫాడేస్తున్నాడు. ‘పుష్ప’ (Pushpa) రిలీజ్ అయినప్పటి నుండి మొదలైన వర్మ బాలీవుడ్ ట్వీట్స్ ‘కెజియఫ్ 2’ (KGF 2)తో పీక్ స్టేజ్‪కి చేరాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ మళ్ళీ టాలీవుడ్‪ని బాలీవుడ్‪ని కంపేర్ చేస్తూ వరుస ట్వీట్‪లతో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. 


సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) నటించిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా కలెక్షన్లపై ట్వీట్ చేసిన వర్మ... బాలీవుడ్‪ని మరోసారి ఏకిపారేశారు. గత కొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి అసలు బాగోలేదు, స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్స్‪ని రాబట్టలేకపోతున్నాయి. చిన్న సినిమాల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. మరో వైపు హిందీలో రిలీజ్ అయ్యే సౌత్ సినిమాలు ఏమో కోట్లకి కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. దీంతో బాలీవుడ్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 


ఈ నేపథ్యంలో రీసెంట్‪గా విడుదలైన ‘జయేశ్ భాయ్ జోర్ధార్’ (Jayeshbhai Jordaar) సినిమా వసూళ్లు కూడా చాలా వీక్‪గా ఉన్నాయి. రణ్వీర్ సింగ్ వంటి స్టార్ హీరో నటించిన ఈ సినిమా కనీసం ఇరవై కోట్ల కలెక్షన్స్‪ను కూడా రాబట్టలేకపోయింది. ఇదే టైంలో రీజనల్ సినిమాగా టాలీవుడ్‪లో మాత్రమే రిలీజ్ అయిన ‘సర్కారు వారి పాట’ మాత్రం ఏకంగా 160 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఈ విషయాన్నే ట్వీట్ చేసిన వర్మ.. సర్కారు వారి పాటని బాలీవుడ్ మూవీ ‘జయేశ్ భాయ్ జోర్ధార్’తో కంపేర్ చేశారు. టాలీవుడ్ సినిమాలను బాలీవుడ్ సినిమాలను పోల్చుతూ.. వర్మ తన ట్విట్టర్‪లో బాలీవుడ్ పరువును మరోసారి నెట్టింట పడేశారు.



Updated Date - 2022-05-18T03:12:10+05:30 IST