విడాకుల వేళ... సంబరాలు చేసుకోవాలంటోన్న RGV

ABN , First Publish Date - 2022-01-19T04:16:07+05:30 IST

వీలైనప్పుడల్లా ‘భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు... భర్తగ మారకు బ్యాచిలరు’ అంటూ తన ఫిలాసఫీని వినిపించే డైనమిక్ డైరెక్టర్ మరోసారి అదే చేశాడు. ఈ సారి ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోతున్నట్టు ప్రకటించగానే ట్వీట్స్‌తో విజృంభించాడు...

విడాకుల వేళ... సంబరాలు చేసుకోవాలంటోన్న RGV

‘‘పెళ్లి... మన దుర్మార్గులైన పెద్దలు సమాజం మీద రుద్దిన అత్యంత దారుణమైన ఆచారం’’ అంటున్నాడు వర్మ! వీలైనప్పుడల్లా ‘భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు... భర్తగ మారకు బ్యాచిలరు’ అంటూ తన ఫిలాసఫీని వినిపించే డైనమిక్ డైరెక్టర్ మరోసారి అదే చేశాడు. ఈ సారి ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోతున్నట్టు ప్రకటించగానే ట్వీట్స్‌తో విజృంభించాడు. అయితే, ఎక్కడా వారిద్దరి పేర్లు ప్రస్తావించకుండానే విడాకుల గొప్పతనం, పెళ్లిలోని చీకటి కోణం ఆర్జీవి ఆవిష్కరించాడు. 


పెళ్లి, విడాకులు, ప్రేమ వంటి అంశాలపై వరుస ట్వీట్స్ చేసిన రాము ‘‘విముక్తి లభిస్తోంది కాబట్టి, విడాకుల్ని మాత్రమే ‘సంగీత్’ ఏర్పాటు చేసుకుని సంబరంగా జరుపుకోవాలి. పెళ్లిల్లు... ఒకరిలోని ప్రమాదకరమైన గుణాల్ని మరొకరు పరీక్షించుకుంటూ... నిశ్శబ్ధంగా చేసుకోవాలి!’’ అన్నాడు. అంతే కాదు, తెలివైన వారు ప్రేమిస్తారు... మూర్ఖులు మాత్రమే పెళ్లి చేసుకుంటారు అంటో మరో కొటేశన్ కూడా ఆయన వదిలాడు. 


నాగ చైతన్య, సమంత విడిపోయినప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ విడాకులే ముద్దంటూ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు మరోసారి ధనుష్, ఐశ్వర్య బ్రేకప్ సమయంలోనూ వర్మ తన ఫిలాసఫీ వినిపించాడు. కాకపోతే, ఆయనకు ఆన్‌లైన్‌లో మద్దతు ఎంతగా లభిస్తే అంతే స్థాయిలో ఎదురు దాడి కూడా జరిగింది. చాలా మంది ఆర్జీవి యాంటీ వెడ్డింగ్ ట్వీట్స్‌కి యాంటీగా రిప్లైస్ ఇచ్చారు...  

Updated Date - 2022-01-19T04:16:07+05:30 IST