Ram gopal varma: క్యాసినోపై ముందు ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి..

ABN , First Publish Date - 2022-01-24T17:49:34+05:30 IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్యాసినోపై ముందు ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి..అంటూ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్స్ రేట్ల విషయంలో, ఆ తర్వాత సంక్రాంతి

Ram gopal varma: క్యాసినోపై ముందు ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్యాసినోపై ముందు ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి..అంటూ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్స్ రేట్ల విషయంలో, ఆ తర్వాత సంక్రాంతి పండుగ సమయంలో జరిగిన వ్యవహారం మీద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుడివాడ క్యాసినోపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. అందులో ‘కొడాలి నాని కంటే ముందు గుడివాడ క్యాసినో లైఫ్ గురించి నేను గ్రేట్ జయ మాలిని ద్వారా విన్నాను. అలాగే, సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా తన సినిమాలో ఆ పాటను అనుమతించారు. అందుకే, క్యాసినోపై కొడాలి నానిని ప్రశ్నించే ముందు టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి’ అంటూ పేర్కొన్నారు. 


అంతేకాదు, ఈ ట్వీట్‌కు ‘యమగోల’ సినిమాలోని ‘గుడివాడ వెళ్లాను’ అనే వీడియో సాంగ్‌ను జత చేయడం ఆసక్తికరమైన విషయం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా, ఇంతకముందు టికెట్ రేట్ల విషయంలో ఏపీ మంత్రి పేర్ని నానితో వర్మ చర్చచలు జరిపిన సంగతి తెలిసిందే. కానీ, దీని వల్ల ఎలాంటి పరిష్కారం లభించలేదు. వర్మ మాత్రం ఈ మధ్య వరుస ట్వీట్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. 

If #TDP is demanding answers from @IamKodaliNani about GUDIWADA , 1st they should demand answers from NTR https://t.co/7WTnZWCcvj

— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2022



Updated Date - 2022-01-24T17:49:34+05:30 IST