పబ్‌లో అమ్మాయిలతో ఆర్జీవీ చిందులు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-01-28T04:31:27+05:30 IST

సంచలనాలకు కేంద్రబిందువైన వర్మ.. ఇప్పుడు మరో వీడియోతో వార్తల్లో నిలిచారు. పబ్‌లో అమ్మాయిలతో చిందులు వేస్తున్న వీడియోని వర్మ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియోలో అమ్మాయిలే కాదు.. మద్యం కూడా ఏరులై పారుతోంది. ఇక రోజుకో

పబ్‌లో అమ్మాయిలతో ఆర్జీవీ చిందులు.. వీడియో వైరల్

సంచలనాలకు కేంద్రబిందువైన వర్మ.. ఇప్పుడు మరో వీడియోతో వార్తల్లో నిలిచారు. పబ్‌లో అమ్మాయిలతో చిందులు వేస్తున్న వీడియోని వర్మ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియోలో అమ్మాయిలే కాదు.. మద్యం కూడా ఏరులై పారుతోంది. ఇక రోజుకో అమ్మాయ్ అన్నట్లుగా అమ్మాయిలతో వర్మ ఉండే ఫొటోలు నెట్‌లో ఎప్పుడూ దర్శనమిస్తూనే ఉంటాయి. ఈ వీడియోలో అయితే వర్మ చుట్టూ అమ్మాయిలే ఉన్నారు. జీవితాన్ని అనుభవించడం కూడా ఒక కళే అన్నట్లుగా.. మద్యం, అమ్మాయిలతో మునిగిపోయే ఈ క్రియేటివ్ డైరెక్టర్.. ఆ విషయాన్ని పబ్లిక్‌కి చెప్పడానికే అన్నట్లుగా ఇలా వీడియోలను వదులుతుంటారు. వీడియోతో పాటు ఆయన పోస్ట్ చేసిన ఫొటోకి క్యాప్షన్ చెబితే రూ. లక్ష రూపాయలు ఇస్తానంటూ కూడా వర్మ మరో ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకున్న వర్మ.. మరో చేతితో అమ్మాయిని ఘాడంగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటున్నారు. ఆయన రచ్చ అసలు మాములుగా లేదు.  


తాజాగా ‘కొండా’ ట్రైలర్ విడుదల చేసే విషయంలో హడావుడి చేసి వార్తలలో నిలిచిన కొన్ని గంటలలోనే మూడ్‌ మార్చి.. ఇలా పబ్‌లో దర్శనమివ్వడం ఆయనకి మాత్రమే చెల్లింది అంటూ ఈ వీడియోపై కామెంట్స్ పడుతున్నాయి. అంతేకాదు, ‘బతికితే నీలానే బతకాలి బాసూ’ అంటూ వర్మని ఆకాశానికి ఎత్తేస్తున్న నెటిజన్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో హాట్‌హాట్‌గా వైరల్ అవుతున్నాయి.





Updated Date - 2022-01-28T04:31:27+05:30 IST