‘‘నేను ఈ వేడుకకు అతిథిగా రాలేదు.. నాన్నగారి దూతగా, ఆయన ఆశీస్సులు అందించడానికి వచ్చాను..’’ అని అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ రొమ్-కామ్‌గా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీని దిల్‌రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో జనవరి 28న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండగా.. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో.. చిరు స్థానంలో రామ్ చరణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ వేడుకకు అతిథిగా రాలేదు. నాన్నగారి దూతగా వచ్చాను. ఆయన ఆశీస్సులు తెలియపరచడానికి వచ్చాను. యంగ్ నిర్మాతలు శ్రావ్య, సుధీర్ ఈ స్థాయికి చేరడం మామూలు విషయం కాదు. దర్శకుడు నగేష్గారు నేషనల్ అవార్డు విన్నర్. నా కాలేజీ డేస్‌లో నగేష్గారి సినిమా చూశాను. మనం ఇప్పుడు ఓటీటీ చూసి ఎంజాయ్ చేస్తున్నాం.. నగేష్గారు ఎప్పుడో అది ఓపెన్ చేశారు. ఇక్బాల్, హైదరాబాద్ బ్లూస్ వంటి సినిమాలు అందుకు నిదర్శనాలు. ఇక ఇంత మంది దిగ్గజాలు ఈ సినిమాకి పనిచేస్తే.. ఇది చిన్న సినిమా ఎలా అవుతుంది. కానే కాదు, చాలా మీనింగ్ ఫుల్ సినిమా అని నాకు అనిపిస్తుంది. అందరికీ లైట్హౌస్గా దేవీశ్రీప్రసాద్ ఉన్నారు. ఆయనతో ‘రంగస్థలం, ఎవడు’ సినిమాలకు పనిచేశాను. సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడాలేదు. ఇప్పుడు ఏ బోర్డర్ లేకుండా ఇండియన్ సినిమా అని రాజమౌళిగారి వల్ల పేరు వచ్చేసింది. ఇండియన్ సినిమాలో ఆడ, మగ కలిసే పనిచేస్తున్నారు. అందరూ ఒక్కటే. ఆది పినిశెట్టి రంగస్థలంలో మా అన్నగా చేశారు. ఇక కీర్తి సురేష్ ‘మహానటి’లో కీర్తి తపన నచ్చింది. ఆ సినిమాతో ఆమె నేషనల్ అవార్డు దక్కించకోవడం గ్రేట్. ఇలాంటి కథలు కీర్తి సురేష్గారే చెప్పాలి. ఈనెల 28న సోలో రిలీజ్ దొరకడంతో.. మంచి విజయం చేకూరుతుందని భావిస్తున్నాను. కీర్తి అభిమానులతోపాటు మా అభిమానులు కూడా సినిమా చూడాల్సిందిగా కోరుతూ చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు.