Ram charan: 'RRR' చాలా ధైర్యాన్నిచ్చింది.

ABN , First Publish Date - 2022-01-16T13:38:19+05:30 IST

'ఆర్ఆర్ఆర్' చాలా ధైర్యాన్నిచ్చింది అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా కరోనా గనక దెబ్బకొట్టకపోయి ఉంటే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్‌లో సందడి చేస్తూ ఉండేది.

Ram charan: 'RRR' చాలా ధైర్యాన్నిచ్చింది.

'ఆర్ఆర్ఆర్' చాలా ధైర్యాన్నిచ్చింది అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా కరోనా గనక దెబ్బకొట్టకపోయి ఉంటే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్‌లో సందడి చేస్తూ ఉండేది. తప్పని పరిస్థితుల్లో నాలుగోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే, ఇటీవల చరణ్ మాట్లాడుతూ.."రాబోయే రోజుల్లో మరికొన్ని హిందీ సినిమాలు చేయడానికి 'ఆర్ఆర్ఆర్' తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఇకముందు మరిన్ని పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇకపై ప్రేక్షకులు.. సినిమాలను, నటీనటులను చూసే విధానాన్ని 'ఆర్ఆర్ఆర్' పూర్తిగా మార్చేస్తుంది అని పేర్కొన్నారు. కాగా, చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమాను చేస్తుండగా..షూటింగ్ దశలో ఉంది. అలాగే త్వరలో గౌతమ్ తిన్ననూరి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు. 

Updated Date - 2022-01-16T13:38:19+05:30 IST