ముంబైలో రామ్ చరణ్ బంగ్లా.. కారణమదేనా?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’ త‌ర్వాత చేస్తున్న సినిమాల‌న్నీ పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో చ‌ర‌ణ్ బాలీవుడ్ జ‌నాల‌పై ఫోక‌స్ చేయాల‌నుకుంటున్నాడు. ముంబై వెళ్లిన ప్ర‌తీసారి చ‌ర‌ణ్ హోట‌ల్స్‌లో ఉండాల్సి వ‌స్తుంది. దీంతో ముంబైలో ఓ ఇల్లు కొనాల‌ని చ‌ర‌ణ్ ఎప్ప‌టి నుంచో అనుకున్నాడ‌ట‌. అందులో భాగంగా ముంబైలో ఖ‌రీదైన ఇంటిని సొంతం చేసుకున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. బీచ్ ఫేసింగ్ ఉండే ఈ బంగాళాలోకి రీసెంట్‌గానే చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు గృహ ప్ర‌వేశం కూడా చేశార‌ట‌. ‘ఆర్ఆర్ఆర్’ త‌ర్వాత శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మాత‌గా చ‌ర‌ణ్ పాన్ ఇండియా మూవీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.