హాలీవుడ్ సినిమాలతో పోటీ పడబోతున్న‘RRR’.. ప్రతిష్ఠాత్మక అవార్డ్స్‌‌లో నామినేషన్..

ABN , First Publish Date - 2022-06-29T22:39:03+05:30 IST

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్

హాలీవుడ్ సినిమాలతో పోటీ పడబోతున్న‘RRR’.. ప్రతిష్ఠాత్మక అవార్డ్స్‌‌లో నామినేషన్..

దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్(Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. రూ.1150కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది.అత్యధిక కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ విజువల్ వండర్‌ను థియేటర్స్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలో చూస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి విదేశీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విపరీతంగా చూస్తున్నారు. అద్భుతంగా ఆదరిస్తున్నారు. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన ఘనతను సాధించింది. ప్రతిష్ఠాత్మక అవార్డ్స్‌కు నామినేషన్‌ పొందింది. 


‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌’ లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఉత్తమ చిత్రం కేటగీరిలో నామినేషన్ పొందింది. ఈ విషయాన్ని‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘‘హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డ్స్‌కు ‘ఆర్ఆర్‌ఆర్’ ఉత్తమ సినిమా కేటగీరీలో నామినేషన్ పొందడం సంతోషకరంగా ఉంది’’ అని ‘ఆర్‌ఆర్‌ఆర్’ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ అవార్డ్స్‌‌‌లో ఇంత వరకు ఏ భారతీయ చిత్రం కూడా పోటీపడలేదు. కానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్’ మాత్రమే ఈ ఘనతను సాధించింది. ఈ అవార్డ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ తో పాటు మరో 9హాలీవుడ్ సినిమాలు పోటీపడబోతున్నాయి.



Updated Date - 2022-06-29T22:39:03+05:30 IST