త్వరలో మరో పాన్ ఇండియన్ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమానే కేజీఎఫ్ ఛాప్టర్ 2. కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఈవెంట్ నేటి సాయంత్రం ఘనంగా బెంగుళూరులో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా బాలీవుడ్స్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ వ్యవహరించబోతున్నారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అయితే, ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు చరణ్ స్పెషల్ పోస్టర్‌తో సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమా సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ 1 కు సీక్వెల్ అని తెలిసిందే.