Prabhas: ఆ ఇద్దరూ తలుచుకుంటే ప్రభాస్‌కి చెక్ పెట్టడం ఈజీనే!

Twitter IconWatsapp IconFacebook Icon

Prabhas: ఆ ఇద్దరూ తలుచుకుంటే ప్రభాస్‌కి చెక్ పెట్టడం ఈజీనే!

జనరల్‌గా శాండల్ వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మల్లువుడ్... ఇలా ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరో ఉంటాడు. డిజిటల్, థియేటర్, శాటిలైట్ ఇలా ఏ రికార్డ్ అయినా ఆ టాప్ హీరో పేరునే ఉంటాయి. అయితే ఏ ఇండస్ట్రీకి ఎవరు స్టార్ హీరో అయినా ఆల్ ఇండియాకి ఉన్న ఏకైక స్టార్ హీరో ప్రభాస్ (Prabhas). దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో ప్రభాస్ బాక్సాఫీస్ రికార్డులే టాప్ ప్లేస్‌లో ఉంటాయి. కాకపోతే టాలీవుడ్‌లో మాత్రం ఈ లెక్క మారుతుంది. ఇక్కడ రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) లాంటి హీరోలు ప్రభాస్ రికార్డుల పునాదులని కదిలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 


చరణ్ (Charan), ఎన్టీఆర్ (Jr NTR) ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ... పాన్ ఇండియా కేటగిరిలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే గ్రాండ్ ఎంట్రీ దక్కింది కానీ ప్రభాస్ బాహుబలి రికార్డ్స్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ రికార్డులే టార్గెట్‌గా శంకర్‌ (Shankar)తో రామ్ చరణ్ కలిస్తే, కొరటాల శివ (Koratala Siva) అండ్ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel)తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఈ మోస్ట్ యాంటిసిపెటేడ్ ప్రాజెక్ట్స్‌తో బాక్సాఫీస్ లెక్కలు, నాన్ ప్రభాస్ రికార్డులు అనే మాటని శాశ్వతంగా క్లోజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చరణ్, ఎన్టీఆర్. మాస్ హీరోలు అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉండే చరణ్, ఎన్టీఆర్‌లకి సరైన హిట్ మరొకటి పడితే, సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా వసూళ్ల వర్షం కురిపించగలరు. 


గత ఏడేళ్లలో ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్ రికార్డ్స్ ని టార్గెట్ చేశారు కానీ.. అవి బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాలేదు. చరణ్, ఎన్టీఆర్‌లకి ఉన్న బాక్సాఫీస్ పొటెన్షియాలిటిని కన్సిడర్ చేస్తే ప్రభాస్‌కి మన హీరోలు చెక్ పెట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ అయ్యే లోపు, ఇండియాలో ప్రభాస్ రికార్డ్స్ ప్లేస్‌లో చరణ్ రికార్డ్స్ అనో, ఎన్టీఆర్ రికార్డ్స్ అనో వినే ఛాన్స్ అయితే లేకపోలేదు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.