Ram: 'ది వారియర్‌'కు భారీ ఆఫర్...?

ABN , First Publish Date - 2022-01-26T14:11:19+05:30 IST

రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ది వారియర్'. ఈ చిత్రానికి బాలీవుడ్‌లో భారీ ఆఫర్ వచ్చినట్టు తాజా సమాచారం. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఇందులో రామ్ పోలీస్

Ram: 'ది వారియర్‌'కు భారీ ఆఫర్...?

రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ది వారియర్'. ఈ చిత్రానికి బాలీవుడ్‌లో భారీ ఆఫర్ వచ్చినట్టు తాజా సమాచారం. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్‌ను రూ. 16 కోట్లకు ఓ బాలీవుడ్ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఆది పినిశెట్టి, అక్షర గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఇటీవల ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్..అలాగే, రామ్ ఫస్ట్ లుక్‌ను వదిలారు. దీనికి మంచి స్పందన వచ్చింది.  

Updated Date - 2022-01-26T14:11:19+05:30 IST