రామ్‌ 19...టైటిల్‌ అదేనా?

ABN , First Publish Date - 2021-07-10T22:10:19+05:30 IST

హీరో రామ్, డైరెక్టర్‌ లింగుసామి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందబోయే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉస్తాద్‌ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్‌ ఏమైనా స్పందిస్తుందేమో..

రామ్‌ 19...టైటిల్‌ అదేనా?

హీరో రామ్, డైరెక్టర్‌ లింగుసామి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందబోయే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉస్తాద్‌ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్‌ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా రెగ్యులర్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. అయితే జూలై 12వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు రీసెంట్‌గా చిత్రీ యూనిట్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం రామ్‌ హీరోగా నటిస్తోన్న 19వ చిత్రం. 

Updated Date - 2021-07-10T22:10:19+05:30 IST